చిరు 150వ సినిమా కోసం రెండు టీమ్స్ మధ్య యుద్ధం.!

చిరు 150వ సినిమా కోసం రెండు టీమ్స్ మధ్య యుద్ధం.!

Published on Jun 25, 2015 10:46 AM IST

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతో రోజూ ఏదో ఒక న్యూస్ బయటకి వస్తూనే ఉంది. తన 150వ సినిమా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఉంటుందని అనౌన్స్ చేసినప్పటి నుంచీ మరీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.ఆటో జానీ అనే టైటిల్ ని ఖరారు చేసిన ఈ సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూరి టీం చేసిన సెకండాఫ్ చిరంజీవిని పూర్తిగా మెప్పించలేదని, అందుకే ప్రస్తుతం పూరి – బివిఎస్ రవి సెకండాఫ్ మీద వర్క్ చేస్తున్నారు.

మరోవైపు స్టార్ రైటర్ చిన్నికృష్ణని కూడా రంగంలోకి దించడంతో తను వివి వినాయక్ తో కలిసి చిరు 150వ సినిమా కోసం కథని రాసే పనిలో ఉన్నాడు. ఈ రెండు టీమ్స్ ఎవరికీ వారు చిరు 150వ సినిమా కోసం కథని సిద్దం చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే ఈ యుద్దంలో ఎవరు ఫైనల్ విన్నర్ అనేది చిరంజీవి నిర్ణయిస్తారు. ఎవరైతే కథతో చిరంజీవిని మెప్పిస్తారో వారికే చిరు 150వ సినిమాని డైరెక్షన్ చేసే అవకాశం వస్తుంది. మరి ఈ ఫైట్ లో ఎవరు విజేత అనేదాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు