మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిన కబీర్ సింగ్

మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిన కబీర్ సింగ్

Published on Jun 25, 2015 2:57 PM IST

Kabir-Duhan-Singh
మనకు నచ్చిన హీరో యొక్క హీరోయిజం ఆన్ స్క్రీన్ ఎలివేట్ అవ్వాలి అంటే ఆ హీరోకి సరిసమానంగా పోటీ ఇచ్చే విలన్ ఉండాలి. ఎప్పుడైతే విలన్ బలంగా ఉంటాడో అప్పుడే హీరో అంతకు మీంచి ఎలివేట్ అవుతాడు. ఇది ఇప్పటికే ప్రూవ్ అయిన కాన్సెప్ట్. ఇప్పటికే ఎంతో మంది విలన్స్ గా మెప్పించి స్టార్డం తెచ్చుకున్నారు, తాజాగా అలాంటి వారి జాబితాలో చేరిన యంగ్ యాక్టర్ కబీర్ సింగ్. మొదటి సినిమాతోనే లుక్స్, పర్సనాలిటీ అండ్ స్క్రీన్ ప్రెజన్స్ పరంగా అందరినీ మెప్పించాడు.

ఫరిదాబాద్ కి చెందిన ఈ ఆరడుగుల కబీర్ సింగ్ గోపీచంద్ నటించిన ‘జిల్’ సినిమాతో అందరినీ ఆకట్టుకొడవడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఒక్క సినిమాతో తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో విలన్ గా చాన్స్ కొట్టేసాడు. ప్రకాష్ రాజ్, సోనూ సూద్ లాంటి విలన్ పాత్రల తర్వాత కొన్ని పవర్ఫుల్ రోల్స్ కి కబీస్ సింగ్ ని ఎంపిక చేస్తున్నారు. కబీర్ తెలుగులో నటించిన కిక్ 2 సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

తాజా వార్తలు