అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్.?

అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్.?

Published on Jun 25, 2015 7:44 PM IST

Rakul-Preet-Singh
‘S/O సత్యమూర్తి’ లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టైలిష్ స్టార్ అర్జున్ తన తదుపరి సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి చేయనున్నాడు. ఈ సినిమా ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్ ఆడిపాడే అవకాశం ఉందని ఇది వరకే తెలియజేశాం.

తాజాగా ఈ చిత్ర టీంకి సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ సరసన మెయిన్ హీరోయిన్ గా టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనలిజ్ చేసారని సమాచారం . త్వరలోనే సెకండ్ హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఈ చిత్ర టీం భావిస్తోంది. సెకండ్ హీరోయిన్ కోసం ఓ ఫ్రెష్ ఫేస్ ని చూస్తున్నారు. వరుస హిట్స్ మీదున్న బోయపాటి శ్రీను – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

బోయపాటి శ్రీను అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూపని రీతిలో చూపేలా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేసాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుసగా ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి బన్ని సరసన నటించే అవకాశం రావడం మరో బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

తాజా వార్తలు