
భారతీయ సినీ పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయి పేరున్నది ఫిల్మ్‌ఫేర్ అవార్డులకే! హిందీ, తెలుగు, తమిళం, కన్నడం మళయాలం ఇలా ఒక్కో భాష సినిమాలకు విడివిడిగా ఈ అవార్డులను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. 2014లో విడుదలైన హిందీ సినిమాలకు సంబంధించిన అవార్డులను ఇప్పటికే ప్రదానం చేయగా నేడు సౌతిండియాలోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ సాయంత్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకను హీరో రాహుల్ రవీంద్రన్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన అతడి భార్య చిన్మయిలు తమ యాంకరింగ్‌తో నిర్వహించనున్నారు. నాలుగు సౌతిండియన్ సినీ పరిశ్రమల్లోని పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక పలు క్యాటగిరీల్లో అవార్డు కోసం 2014లో విడుదలైన టాప్ సినిమాలు పోటీ పడుతున్నాయి.

