కన్నడ సినిమాకి స్వరాలను అందించనున్న తెలుగు సంగీత దర్శకుడు

కన్నడ సినిమాకి స్వరాలను అందించనున్న తెలుగు సంగీత దర్శకుడు

Published on Jun 27, 2015 10:39 PM IST

Raghu-kanchu
గాయకుడి నుండి సంగీత దర్శకుడి అవతారం ఎత్తిన రఘు కుంచె తెలుగులో కొన్ని మంచి సినిమాలకు పాటలు అందించిన విషయం విదితమే. ఈయన ఇప్పుడు తన సంగీత మాధుర్యాన్ని కన్నడ సినీ ప్రేక్షకులకు సైతం రుచిచుపించానున్నాడు. కన్నడ అగ్ర నటుడు దర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమాకు రఘు ట్యూన్స్ ఇవ్వడమేకాక గాత్రాన్ని సైతం పాటలకు అందించనున్నారు.

బంపర్ ఆఫర్ సినిమాతో రఘు కుంచె సంగీత దర్శకుడిగా మారాడు. ఈ చిత్రం 2009లో విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. తాజాగా దొంగాట చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇది కూడా హిట్ అల్బమే. గాయకుడిగా 500కి పైగా పాటలు పాడి లెక్కలేనన్ని అవార్డులను అందుకున్నాడు. కొన్ని టి.వి షో లకు యాంకర్ గా కూడా పనిచేసాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి సాయశక్తులా కృషిచేస్తున్నాడు.

తాజా వార్తలు