
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కార్తీ. కార్తీ తన బ్రదర్ సూర్యతో కలిసి సూర్య ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన అగరం ఫౌండేషన్ కోసం తనవంతు సాయం చేస్తూనే ఉన్నాడు. ఇది కాకుండా తాజాగా స్కూల్ గర్ల్స్ కోసం ఓ మంచి పనిచేసి వారికి సాయం చేసాడు. చెన్నై టి నగర్లోని గుంటూరు సురబయ్య పిళ్ళై గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్ కాంపస్ లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బందులకు లోనవుతున్నారు.
ఈ విషయం తెలియగానే వెంటనే స్పందించిన కార్తీ వెంటనే తన టీంని పంపించి వారికోసం టాయిలెట్స్ కట్టించాడు. దీంతో ఆ స్కూల్ గర్ల్స్ మరియు స్టాఫ్ అంటా కార్తీని కలిసి తమ వైపు నుంచి స్పెషల్ థాంక్స్ తెలియజేశారు. ఫిల్మ్ స్టార్స్ ఇలాంటి పనులు చేయడం చాలా మంచిది, అంతే కాకుండా ఎంతో మందికి మార్గదర్శకంగా కూడా నిలుస్తుంది. కార్తీ ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

