
ప్రతి ఏడాది జరిగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక శుక్రవారం సాయంత్రం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి సౌత్ లోని నాలు ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి స్టార్స్ అందరూ అటెండ్ అయ్యారు. 2014కి గాను ఇచ్చిన ఈ అవార్డ్స్ లో రేసు గుర్రం సినిమాకి గాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకుంటే, నాగార్జున నటించిన మనం సినిమా బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఈ వేడుకలో అల్లు అర్జున్ తనకి వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డు ని తెలుగు సినిమా లెజెండ్ అయిన అక్కినేని నాగేశ్వరరావు కి అంకితం ఇచ్చాడు.
అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెగా ఫాన్స్ తో పాటు అక్కినేని ఫాన్స్ కూడా బన్నిని మెచ్చుకోవడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా బన్నికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున కూడా బన్నిని మెచ్చుకున్నారు. ‘అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పిన మాటలు మరియు ఆయనకీ అవార్డు అంకితం ఇచ్చినందుకు చాలా థాంక్స్’అని నాగార్జున ట్వీట్ చేసాడు. ఇలాటి శుభసూచకమైన వాతావరం ఇదరు స్టార్ హీరోస్ మధ్య ఉండడం ఎంతో అభినందించదగిన విషయం.
Thank you Allu Arjun for dedicating your award to ANR and your words?
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 28, 2015

