సస్పెన్స్ పెంచేస్తున్న ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్

సస్పెన్స్ పెంచేస్తున్న ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్

Published on Jul 7, 2015 11:18 AM IST

Ntr
‘టెంపర్’ తర్వాత ఇదిగో, అదిగో అంటూ వెనక్కి వెళుతూ వచ్చిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొత్త మూవీ మొదలైంది. సుకుమార్ డైరెక్షన్ లో ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ సినిమాని నిన్న ఓ యాక్షన్ ఎపిసోడ్ తో లండన్ లో మొదలైంది. అంతే కాకుండా ఇన్ని రోజులు ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో ఓ స్టైలిష్ లుక్ లో విత్ గడ్డంతో కనిపించనున్నాడు అనే వార్తలకి కూడా తెరపడింది. దానికి కారణం ఎన్.టి.ఆర్ ది మోస్ట్ స్టైలిష్ లుక్ ని విడుదల చేయడమే. నిన్న షూటింగ్ మొదలయినప్పటికీ ఈ సినిమా సెట్స్ నుండి రెండు ఎన్.టి.ఆర్ స్టిల్స్ ని రిలీజ్ చేసారు.

ఎన్.టి.ఆర్ లుక్ కి అందరి నుంచీ సూపర్బ్ రేస్పోంస్ వచ్చింది. ముఖ్యంగా అభిమానుల ఆనందానికి అవధులు లేదు. ఎన్.టి.ఆర్ లుక్ విషయంలో వారు చాలా హ్యాపీగా ఉన్నారు కానీ అక్కడే ఓ చిన్న సస్పెన్స్ కి కూడా అవారు గురవుతున్నారు. ఎన్.టి.ఆర్ కి ఇలాంటి లుక్ ఇవ్వడం వెనకున్న కథ ఏంటి.? అసలు ఎలాంటి పాత్రలో ఎన్.టి.ఆర్ కనిపించనున్నాడు అనే విషయాలు అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తున్నాయి. మరి సుకుమార్ ఎన్.టి.ఆర్ కోసం డిజైన్ చేసిన న్యూ క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు