సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’. జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో, మే 8న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో హీరో సుమంత్ సినిమా విశేషాలను పంచుకున్నాడు.
‘మేము ఫేమస్’ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?
అవును, దాదాపు మూడేళ్ల తర్వాత నా సినిమా వస్తోంది. అందుకే ఇది కూడా నాకు తొలి సినిమాలానే అనిపిస్తోంది. ఆడియన్స్‌కు దగ్గరవ్వాలని చాలా అగ్రెసివ్‌గా, వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నాం. సినిమా రిజల్ట్ విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.
ప్రమోషన్స్ చాలా ‘కూల్’గా చేస్తున్నారు, మీరు ఎంత కూల్‌గా ఉన్నారు?
నేనైతే కూల్‌గా లేను! కానీ సినిమా సమ్మర్‌లో వస్తుంది కాబట్టి ‘కూల్’ కాన్సెప్ట్‌తో ప్రమోషనల్ వీడియోలు ప్లాన్ చేశాను. ఆ వీడియోలన్నీ నేనే రాసి డైరెక్ట్ చేశాను. వాటికి మిలియన్ల వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉంది.
మీరు తెలంగాణ కుర్రాడు కదా, మరి గోదావరి యాస కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
అది నిజంగా ఛాలెంజింగ్. గోదావరి యాస కోసం దాదాపు నాలుగు నెలల పాటు రిహార్సల్స్ చేశాను. అక్కడ పుట్టి పెరిగిన వారు సినిమా చూసినప్పుడు, నా మాట తీరు సహజంగా ఉండాలని చాలా కష్టపడ్డాను.
మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?
ఇందులో నేను ఆటో డ్రైవర్‌గా కనిపిస్తాను. సాధారణంగా ఆటో డ్రైవర్ అంటే మాస్ అనుకుంటారు, కానీ ఇందులో చాలా ఇన్నోసెంట్, క్యూట్ పాత్ర. ఇందులో ఒక ఆటో రేస్ కూడా ఉంటుంది, దాని కోసం నేను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను.
మీ పేరు వెనుక ఉన్న ‘ప్రభాస్’ అనే పేరు ఎలా వచ్చింది?
నా అసలు పేరు సుమంత్. పూర్వం ఫేస్‌బుక్‌లో మనకు ఇష్టమైన హీరో పేరును పక్కన చేర్చుకోవడం ఒక ట్రెండ్. అలా నేను ‘సుమంత్ ప్రభాస్’ అని పెట్టుకున్నాను, అదే కంటిన్యూ అయిపోయింది.
చివరిగా ‘గోదారి గట్టుపైన’ గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?
ఇది ఒక మంచి ఫ్యామిలీ వైబ్ ఉన్న సినిమా. ప్రేమ, ఫన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మే 8న థియేటర్లలో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.


