‘ప్రేమమ్’ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన రామ్

‘ప్రేమమ్’ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన రామ్

Published on Jul 7, 2015 4:01 PM IST

ram

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. రామ్ చేస్తున్న శివం, హరికథ(వర్కింగ్ టైటిల్) సినిమాల షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఇదిలా ఉంటే రామ్ తన తదుపరి సినిమా మళయాళ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలోకి వెళితే 2015 మే 29న మలయాళంలో రిలీజ్ అయిన ప్రేమమ్ అక్కడ బాక్స్ ఆఫీసు రికార్డులను తిరగ రాస్తోంది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ రైట్స్ ని స్రవంతి మూవీస్ బ్యానర్ అయిన స్రవంతి రవికిషోర్ సొంతం చేసుకున్నారు. దాంతో ఈ సినిమాలో రామ్ నటిస్తాడనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలు చూసిన రామ్ ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘ప్రేమమ్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నాం అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, నేను ఇప్పటి వరకూ ప్రేమమ్ సినిమా గురించి వినడమే తప్ప ఇప్పటి వరకూ చూడలేదని’ రామ్ తెలిపాడు. దీని ప్రకారం రామ్ ఇప్పటి వరకూ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనేది అర్థం అవుతుంది. కానీ ఒకవేళ రామ్ ఈ సినిమా చూసాక తనకి చేసే ఆసక్తి ఉంటే మాత్రం ఈ సినిమా తనకే దక్కే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆ రీమేక్ రైట్స్ తీసుకుంది తన హోం బ్యానర్ స్రవంతి మూవీస్ వారే కాబట్టి..

రామ్ నటిస్తున్న శివం సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావడానికి సిద్దం అవుతుంటే, మరో సినిమాని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు