‘బాహుబలి’ సాటిలైట్ రైట్స్ కోసం ఆసక్తికర పోటీ!

‘బాహుబలి’ సాటిలైట్ రైట్స్ కోసం ఆసక్తికర పోటీ!

Published on Jul 11, 2015 2:32 PM IST

baahubali-b
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున నిన్న విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ మొదటి రోజు కలెక్షన్లను కుమ్మేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాగా నిలిచి బాహుబలి సత్తా చాటింది.

ఇదిలా ఉంటే బాహుబలి సినిమా సాటిలైట్ హక్కులకు సంబంధించి రెండు ప్రధాన చానళ్ళ మధ్యన ఆసక్తికర పోటీ నెలకొనడం విశేషంగా కనిపిస్తోంది. ఇప్పటికే ‘బాహుబలి’ హిందీ సాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడై సంచలనం సృష్టించగా, తెలుగు వర్షన్ కూడా అదే స్థాయిలో సుమారు 15-18కోట్ల రేంజ్‌లో పలుకుతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి నిర్మాతలు మాత్రం ఈ రేటు మరింత పెరుగుతుందనే అభిప్రాయంలో ఉన్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయమై ఓ సరైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు కాగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు