చెర్రీ హీరోగా పవన్ కళ్యాణ్ సినిమా!

చెర్రీ హీరోగా పవన్ కళ్యాణ్ సినిమా!

Published on Jul 11, 2015 6:10 PM IST

pawan-ram-charan
పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉండనుందనే ప్రచారం చాలా కాలం నుంచీ జరుగుతున్నా ఈ విషయమై ఇప్పటికీ ఏ క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా సినిమా ఖరారైందని, రామ్ చరణ్ ప్రొడక్షన్‌లో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా ఖరారైందని.. ఇలా చాలా వార్తలే షికారు చేస్తూ వచ్చాయి. తాజాగా ఈ కాంబినేషన్‌పై రామ్ చరణ్ ఓ క్లారిటీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్ విషయమై చరణ్ మాట్లాడుతూ.. బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మాతగా, తాను హీరోగా ఓ సినిమా రూపొందనుందని, పవన్ హీరోగా నటిస్తోన్న ‘గబ్బర్ సింగ్ 2’ పూర్తయ్యాక ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ కూడా మొదలయ్యాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ చరణ్, శ్రీనువైట్ల సినిమాతో బిజీబిజీగా ఉండగా, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.

తాజా వార్తలు