3 రోజుల్లో 40 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘బాహుబలి’

3 రోజుల్లో 40 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘బాహుబలి’

Published on Jul 13, 2015 5:04 PM IST

baahubali-b
గత మూడు రోజుల నుంచి ప్రతి ఒక్క సినీ అభిమానిని, ఫిల్మ్ వర్గాలను థ్రిల్ చేస్తున్న ఒకే ఒక్క విషయం బాహుబలి ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్. ఆంధ్ర, తెలంగాణలోని ప్రతి చిన్న టౌన్ నుంచి ఇండియా, ఓవర్సీస్ దాకా ప్రతి చోటా రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టుకొని సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ ని ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్ కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. మన కళ్ళు రెప్ప వేయకుండా చేసే భారీ సెట్స్, ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్ లతో ‘బాహుబలి – ది బిగెనింగ్’ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది.

కేవలం మొదటి మూడు రోజుల్లోనే ఒక్క తెలుగులోనే బాహుబలి సినిమా 40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. మాకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్ర, తెలంగాణలతో కలుపుకొని బాహుబలి మొదటి మూడు రోజుల్లో 42 – 44 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజే ఇరు రాష్ట్రాల్లో 24 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా రెండవ రోజు సుమారు 9 కోట్లు, మూడవ రోజు సుమారు 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఓవరాల్ గా 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. కేవలం 3 రోజుల్లో 40 కోట్ల మార్క్ క్రాస్ చేసిన సినిమా ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డ్ సాధించింది.

ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ మార్క్ కి ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల స్టార్డం కూడా తోడవడంతో బాహుబలి అన్ని భాషల్లోనూ రికార్డ్స్ సృష్టిస్తోంది. ఫస్ట్ వీకెండ్ కి సంబందించిన క్లియర్ షేర్ వివరాల కోసం డిస్ట్రిబ్యూటర్స్ తో కాంటాక్ట్ లో ఉన్నాం. త్వరలోనే పూర్తి వివరాలను అందిస్తాం..

తాజా వార్తలు