బాహుబలి న్యూ రికార్డ్ – ఓవర్సీస్ లో 4 మిలియన్ మార్క్

బాహుబలి న్యూ రికార్డ్ – ఓవర్సీస్ లో 4 మిలియన్ మార్క్

Published on Jul 13, 2015 8:51 PM IST

Baahubali-still
ఇండియన్ మరియు తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్టింగ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. విడుదలైన మొదటి రోజు నుంచే అటు విమర్శకుల చేత, ఇటు ప్రేక్షకుల చేత సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన నాలుగు భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. ఈ సినిమాని అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీస్ అంతా కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుండడంతో ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.

ఒక్క లోకల్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని నమోదు చేస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి మూడు రోజుల్లోనే ఓవర్సీస్ లో 4.3మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఓవర్సీస్ రోజు వారిగా కలెక్షన్స్ వివరాలు..

వారం
కలెక్షన్స్(డాలర్స్ లో)
గురువారం ప్రీమియర్స్  $ 1,395,000
శుక్రవారం    $ 1,090,359
శనివారం $ 1,115,046
ఆదివారం $ 720,000
మొత్తం $ 4,320,405 [ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 27కోట్లకి పైనే]

తాజా వార్తలు