
సౌత్ సినిమాలలో మొదటగా భారీ తనం, భారీ విజువల్స్ ని పరిచయం చేసిన డైరెక్టర్ శంకర్. రోబో మరియు ఐ లాంటి విజువల్ వండర్స్ ని మనకు అందించిన శంకర్ ప్రస్తుతం తన తదుపరి సినిమా రోబో సీక్వెల్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. రోబోకి కి సీక్వెల్ అయిన ‘రోబో 2’ కథని ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ కి చెప్పడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. సుమారు 130 కోట్ల బడ్జెట్ తో వచ్చిన రోబో సినిమా 2010లో రికార్డ్ కలెక్షన్స్ ని సాధించింది.
ప్రస్తుతం కోలీవుడ్‌లోని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం శంకర్ రోబో సినిమాకి మూడు నాలుగు రెట్లు మించి ఉండేలా రోబో 2 విజువల్స్ ని ప్లాన్ చేస్తున్నారట. అలాగే బడ్జెట్ విషయంలో కూడా రోబో బడ్జెట్ కి డబుల్ అమౌంట్ పెట్టనున్నట్లు, అందులో భాగంగా శంకర్ ఇప్పటికే 225కోట్ల బడ్జెట్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. దానికి రోబో 2 నిర్మించనున్న లైకా ప్రొడక్షన్ హౌస్ వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అలాగ్ ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు స్టార్ పవర్ ని కూడా ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. రజినీకాంత్ కి పోటీనిచ్చే విలన్ గా విక్రమ్ ని సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో శంకర్ రోబో 2 సెట్స్ పైకి వెళ్లనుంది.

