
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా అన్ని షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మహేష్ బాబు తప్ప మిగతా అందరి డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మహేష్ బాబు ప్రస్తుతం సెకండాఫ్ కి డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నాడు. ఇది పక్కన పెడితే మహేష్ బాబు తన కో స్టార్స్ కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడని ఇదివరకే కొంతమంది స్టార్స్ చెప్పారు. తాజాగా స్టార్ హీరో అయిన మహేష్ బాబు ఇచ్చిన సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ చూసి ఓ తమిళ యాక్టర్ షాక్ అయ్యాడు.
ఈ సినిమాలో మహేష్ బాబుని ఢీ కొట్టే ఓ విలన్ గా తమిళ యాక్టర్ హరీష్ ఉథమన్ కనిపిస్తాడు. రీసెంట్ గా తను మహేష్ తో షూట్ లో ఎదురయిన అనుభవం గురించి చెబుతూ ‘ ఫస్ట్ డే నాకు మహేష్ మధ్య ఓ యాక్షన్ సీన్ పెట్టారు. ఆ సీన్ అయ్యాక తను తమిళ్ లో మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందా అనేది చెప్తున్నాడు. ఫస్ట్ నేను ఆయన తమిళ్ మాట్లాడం చూసి షాక్ అయితే, మరోవైపు అంత పెద్ద స్టార్ హీరో అయినా నాకు ఇచ్చిన సపోర్ట్ చూసి థ్రిల్ ఫీలయ్యాను. ఒక సీన్ లో నేను ఎక్కువ టేక్స్ తీసుకుంటూ ఉంటే ఆయన వచ్చి బ్రదర్ నీకు ఇంకో 50 టేక్స్ కావాలన్నా ఇస్తాను కానీ నువ్వు ముందు టెన్షన్ పడద్దు, కాన్ఫిడెంట్ గా చెయ్, దేనికీ వర్రీ అవ్వద్దు అని చెప్పి ఆ సీన్స్ చేయించాడు. మహేష్ బాబు సపోర్ట్ నన్ను పూర్తిగా కట్టిపడేసిందని’ హరీష్ తెలిపాడు.
మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో జూలై 18న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

