‘శ్రీమంతుడు’ ఆడియో లాంచ్ టీజర్ రిలీజ్ డేట్!

‘శ్రీమంతుడు’ ఆడియో లాంచ్ టీజర్ రిలీజ్ డేట్!

Published on Jul 14, 2015 8:10 PM IST

mahesh-sri
మహేష్ అభిమానులు పండగ చేస్కునే నెల దగ్గర పడుతోంది. ఈనెల 18న సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమా ఆడియో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే! ఇక వచ్చే నెల 7న భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో 18న జరగనున్న ఆడియో ఆవిష్కరణ వేడుకకు రెండు రోజుల ముందుగా అంటే జూలై 16న ఆడియో లాంచ్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ లోపుగా రోజుకో పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేయగా, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ చెబుతూ వస్తున్నారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు