
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ ఎంతో కష్టపడి 9 ఏళ్ళు రీసర్చ్ చేసి తెలుగు వీరణారి రాణీ రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్నా హై టెక్నికల్ వాల్యూస్, గ్రాండ్ విజువల్స్ ఉన్న హిస్టారికల్ సినిమా కావడం వలన పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకుంటోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాని 3డిలో చూపించాలనే ఉద్దేశంతో గుణశేఖర్ రుద్రమదేవిని 3డి మరియు 2డిలో షూట్ చేసాడు. కానీ మన ఇరు రాష్ట్రాల్లో 3డి అంటే ప్రతి చోటా 3డి గ్లాసెస్ అందించలేరు. అందుకే గుణశేఖర్ టీం మరో ఉపాయం ఆలోచించారు.
అదే 3డి గ్లాసెస్ లేకుండా 3డి సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ని కలిగించేలా సినిమాని చూపడం. అందుకోసమే గుణశేఖర్ కింగ్ కాంగ్, కుంగ్ ఫూ పాండా, అవతార్ లాంటి సినిమాలకు పనిచేసిన యింగ్ గ్రూప్ సంస్థతో కలిసి ఎన్హాన్స్డ్ డెప్త్ సొల్యూషన్స్ (ఈడీఎస్) అనే టెక్నాలజీని వాడి 3డి గ్లాసెస్ లేకుండానే 3డిసినిమాని చూపించే పని మొదలు పెట్టారు. గత 8 నెలల నుంచి కంటిన్యూగా ఈ వర్క్ చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో ఈ వర్క్ మొత్తం పూర్తి కానుంది. ఈడీఎస్ టెక్నాలజీ ద్వారా రీల్ లోని ఇమేజ్ షార్ప్ నెస్ కొద్దిగా తగ్గినట్లు అనిపించినా సీన్స్ మాత్రం చాలా సహజంగా ఉంటాయని టెక్నికల్ టీం చెబుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టి రిలీజ్ డేట్ ని ఖరారు చేయనున్నారు.
అనుష్క రుద్రమదేవిగా, రానా చాళుక్య వీరభద్రుడిగా, అల్లు అర్జున్ గోనగన్నా రెడ్డిగా కనిపించనున్న ఈ మూవీలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

