
దేశ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైన గ్రాఫికల్ వండర్ ‘బాహుబలి’. విడుదలైన రోజు నుంచే బాక్స్ ఆఫీసు వద్ద అది కురిపిస్తున్న కాసుల వర్షం ఇండియన్ ట్రేడ్ అనలిస్ట్ లను షాక్ కి గురి చేస్తోంది. తెలుగులో వస్తున్న కలెక్షన్స్ అందరినీ షాక్ చేస్తుంటే, అంతకు మించి బాలీవుడ్ లో వస్తున్న షేర్స్ ట్రేడ్ వర్గాలని షాక్ చేస్తున్నాయి. వీక్ డేస్ అయిన సోమ, మంగళ వారాల్లో ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి, ఇంకా చెప్పాలంటే సోమవారంకి మించి మంగళవారం కలెక్షన్స్ వచ్చాయి. ఎస్ఎస్ రాజమౌళి క్రేజ్ మరియు సినిమాలో ఉన్న గ్రాండ్ నెస్ సినిమాని పెద్ద హిట్ చేస్తున్నాయి.
హిందీలోకి డబ్ చేసిన బాహుబలి మొదటి మూడు రోజుల్లో 23 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే వీక్ డేస్ అయిన సోమ, మంగళ వారాల్లో 12 కోట్లు కలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మొదటి రోజు కాస్త తక్కువ షేర్ తో మొదలైనా ఆ తర్వాత నుంచి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే కలెక్షన్స్ ని నమోదు చేసింది.
| వారం | కలెక్షన్స్ (షేర్) |
| శుక్ర వారం |
5.15 కోట్లు
|
| శని వారం | 7.09 కోట్లు |
| ఆది వారం | 10.11 కోట్లు |
| సోమవారం | 6.10 కోట్లు |
| మంగళవారం | 6.15 కోట్లు |
| మొత్తం | 34.60 కోట్లు |
ఒక తెలుగు సినిమా డబ్ వెర్షన్ బాలీవుడ్ లో జస్ట్ ఐదు రోజుల్లో 35కోట్ల మార్క్ టచ్ అవ్వడం ఓ రికార్డ్ అని చెప్పాలి. ఫస్ట్ వీక్ కి సంబందించిన ప్రత్యేక కలెక్షన్ రిపోర్ట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం.. స్పెషల్ అప్డేట్స్ కోసం 123తెలుగు. కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

