ఫేమస్ సింగర్ రామకృష్ణ ఇకలేరు.!

ఫేమస్ సింగర్ రామకృష్ణ ఇకలేరు.!

Published on Jul 16, 2015 8:48 AM IST

Ramakrishna
రెండు రోజుల క్రితమే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శోఖ సముద్రంలో ముంచెత్తిన విషయం లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ కన్నుమూయడం. ఇది జరిగిన రెండు రోజులకే టాలీవుడ్లో మరో భాధాకర సంఘటన జరిగింది. అదే ఫేమస్ సింగర్ విస్సంరాజు రామకృష్ణ గారు మరణించడం. గత కొద్ది రోజులుగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన గత రాత్రి కన్ను మూశారు. 1947 ఆగష్టు 20న జన్మించిన రామకృష్ణ లెజండ్రీ సింగర్ పి. సుశీల గారి దగ్గర బంధువు కావడంతో ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో గాయకుడిగా మారారు.

మొదటగా 1972 లో వచ్చిన ‘విచిత్ర బంధం’ సినిమాతో గాయకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన అందాల రాముడు, భక్త తుకారం, అల్లూరి సీతారామరాజు, దాన వీర శూర కర్ణ, తాత మనవడు, అమరదీపం, భక్త కన్నప్ప మొదలైన సూపర్ హిట్ సినిమాలలో ఆయన పాటలు పాడారు. ఆయన కెరీర్లో సుమారు 5000కి పైగా పాటలు పాడారు. ‘నువ్వే కావాలి’ సినిమాలో ‘అనగనగా ఆకాశం ఉంది’ అనే పాటతో పరిచయం అయిన సాయి కిరణ్ రామకృష్ణ వారసుడే కావడం విశేషం. ప్రస్తుతం రామకృష్ణ మృతదేహాన్ని ప్రముఖుల సందర్శనార్ధం జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో ఉంచారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు చేయనున్నారు.

తాజా వార్తలు