ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఎన్.టి.ఆర్.?

ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఎన్.టి.ఆర్.?

Published on Jul 16, 2015 1:55 PM IST

Ntr
ప్రస్తుతం టాలీవుడ్ లో తన సరికొత్త స్టైల్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.. జూలై 6 నుంచి ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ ని ప్రారంభించాడు. అంతే కాకుండా ఈ సినిమా కోసం తను మార్చుకున్న న్యూ లుక్ మాత్రం అందరినీ థ్రిల్ చేసింది. అలాగే ఆ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్.టి.ఆర్ ఇంతలా తన లుక్ మార్చి ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అనే ప్రశ్న అందరి మదిలోనూ తిరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి మేము సమాధానం అందించే ప్రయత్నం చేస్తున్నాం..

ఈ చిత్ర వర్గాల నుంచి మేము సేకరించిన సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అది కూడా రెగ్యులర్ పోలీస్ గా కాకుండా ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. కథలో ఒక స్పెషల్ మిషన్ మీద అబ్రాడ్ వెళ్ళాల్సి వస్తుందని, అందుకే ఆ పాత్రకి తగ్గట్టు ఎన్.టి.ఆర్ లుక్ లో ఇంత చేంజ్ తీసుకొచ్చాడని చెబుతున్నారు. కానీ ఈ విషయం పై కచ్చితమైన అధికారిక వెలువడలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో శరవేగంగా జరుగుతోంది. జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేయనున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు