
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘శ్రీమంతుడు’ రిలీజ్ నెల ఆగష్టు దగ్గర పడుతోంది. ఈలోపున అభిమానులకు ముందే పండగ వాతావరణం కల్పించేందుకు ఈనెల 18న హైద్రాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఆవిష్కరణ వేడుక వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే! మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక శిల్పకళావేదికలో 18న జరగనున్న ఆడియో ఆవిష్కరణ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయ్! ఈ వేడుకలో ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఆడియో రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు ఉందనగానే అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కొద్దిసేపటి క్రితం ఆడియో టీజర్‌ను విడుదల చేశారు.
కేవలం ఏడు సెకెండ్లు మాత్రమే ఉన్న ఈ ఆడియో టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్ కూల్ మ్యూజిక్‌కు స్టైలిష్ గెటప్‌లో డార్క్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్పాట్‌లైట్స్ మధ్యన నడుచుకుంటూ వచ్చే మహేష్‌ను చూడొచ్చు. ఏడంటే ఏడే నిమిషాలున్న ఈ టీజర్‌కే అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేయగా, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ చెబుతూ వస్తున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
‘శ్రీమంతుడు’ ఆడియో టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

