ఐపిఎల్ టీంపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు బావ.!

ఐపిఎల్ టీంపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు బావ.!

Published on Jul 17, 2015 10:43 AM IST

mahesh-and-ramesh
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా ప్రొడక్షన్ వైపు కూడా అడుగేసిన సంగతి మనకు తెలిసిందే.. అందులో భాగంగానే శ్రీమంతుడు సినిమా నిర్మాతలలో తను ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఇది కాకుండా ఆయన బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టనున్నాడని, అది కూడా తన భావ మరియు గుంటూరు ఎంపి అయిన గల్ల జయదేవ్ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ కి సంబందించిన వైజాగ్ సిక్సర్స్ ఐపిఎల్ టీంని కొనుగోలు చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. గత కొద్ది రోజులుగా ఈ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇందులో జయదేవ్ గల్ల ఈ వార్తలకి తెరదించేసాడు.

‘ప్రస్తుతం మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.. నేను మహేష్ బాబు కలిసి ఐపిఎల్ టీంని కొనుగోలు చేస్తున్నామని కానీ మాకు ఐపిఎల్ టీంని కొనడంలో ఎలాంటి ఆసక్తి లేదని’ జయదేవ్ తెలిపాడు. మొదట ఈ విషయం అభిమానులని షాక్ చేసిన జయదేవ్ స్టేట్మెంట్ తో వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు
లేటెస్ట్ మూవీ శ్రీమంతుడు ఆడియో లాంచ్ రేపు హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. ఇది కాకుండా ఈ నెలాఖరు నుంచి మహేష్ బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొననున్నాడు.

తాజా వార్తలు