బైక్ నడిపేప్పుడు హెల్మెట్ తప్పక వాడమంటున్న బన్నీ!

బైక్ నడిపేప్పుడు హెల్మెట్ తప్పక వాడమంటున్న బన్నీ!

Published on Jul 17, 2015 12:46 PM IST

alluarjun
అల్లు అర్జున్.. తెలుగు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తన సరికొత్త స్టైల్, మ్యానరిజంతో తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరుగా వెలుగొందుతోన్న బన్నీ, ఎండార్స్‌మెంట్ల విషయంలోనూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం పలు నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్న ఈ హీరో నిన్న హైద్రాబాద్‌లో ‘హీరో’ మోటార్స్ కొత్త బైక్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బైక్‌తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

చిన్నప్పట్నుంచీ బైక్ నడపాలన్న ఆశ విపరీతంగా ఉన్నా నాన్న అల్లు అరవింద్ ఎప్పుడూ బైక్ కొనివ్వలేదని చెబుతూ.. తాను బైక్ నేర్చుకుందీ, నడిపిందీ కేవలం సినిమా సెట్స్‌పైనే అని తెలిపారు. ఇదే సందర్భంగా మాట్లాడుతూ.. “బైక్ నడపడం అనేది ఎవ్వరికైనా మంచి ఉత్సాహానిచ్చే విషయమే! అయితే అదే సమయంలో స్పీడ్ డ్రైవింగ్ అనేది ఎంత ప్రమాదకరమో గుర్తుంచుకోవాలి. ప్రమాదమనేది ఎప్పుడూ చెప్పిరాదు. అయితే జాగ్రత్తగా ఉంటే కొన్ని ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. కాబట్టి బైక్ నడిపే ఎవ్వరికైనా హెల్మెట్ తప్పక వాడమనేది నా సలహా” అంటూ అల్లు అర్జున్ అభిమానులకు విన్నవించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ భోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే!

తాజా వార్తలు