‘ఫిబ్రవరి 14- బ్రీత్ హౌస్’ ఆడియో రిలీజ్..!

‘ఫిబ్రవరి 14- బ్రీత్ హౌస్’ ఆడియో రిలీజ్..!

Published on Jul 17, 2015 11:00 AM IST

feb-14
సత్యరావు సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై సత్యరావు కడగన నిర్మించిన హర్రర్ థ్రిల్లర్ ‘ఫిబ్రవరి 14’. బ్రీత్ హౌస్ అనేది ఉపశీర్షిక. వీ.ఎస్. ఫణీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బేబీ ప్రేమ, క్రిష్, ఈషాలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ చిన్నారి జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికర అంశాల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈ ఉదయం హైద్రాబాద్‌లో ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకుడు, ఎమ్మెల్యే కూడా అయిన రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఆడియోను ఆవిష్కరించిన ఆయన సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు. హర్రర్, థ్రిల్లర్ బ్యాక్‌డాప్‌లో వస్తోన్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నామని, సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ప్రవీణ్ రెడ్డి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

తాజా వార్తలు