
నందమూరి బాలకృష్ణ హీరోగా ‘లయన్’ సినిమా నిర్మించిన రుద్రపాటి రమణారావు నిర్మాణ సంస్థ నుంచి మరో సినిమా ‘మిర్చిలాంటి కుర్రాడు’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అభిజీత్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. ‘మిర్చిలాంటి కుర్రాడు’ సినిమా ద్వారా రాజమౌళి, వినాయక్ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన జై నాగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
పలుసార్లు రిలీజ్ అనుకొని వాయిదా పడిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియోని బాలకృష్ణ చేతుల మీద రిలీజ్ చేసారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు బాలకృష్ణకు స్పెషల్ షో వేసారు. ఈ సినిమా చూసిన బాలకృష్ణ సినిమా ఆయనకి బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని తెలిపారని రమణారావు తెలిపాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయని రమణారావు తెలిపాడు.

