ఓటిటిలోకి వచ్చేసిన ‘వారణాసి’ బ్యూటీ హిట్ సిరీస్ సీజన్ 2.. స్పై, యాక్షన్ థ్రిల్లర్ ఎందులో అంటే

ఓటిటిలోకి వచ్చేసిన ‘వారణాసి’ బ్యూటీ హిట్ సిరీస్ సీజన్ 2.. స్పై, యాక్షన్ థ్రిల్లర్ ఎందులో అంటే

Published on May 6, 2026 6:05 PM IST

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన అతికొద్ది మంది బిగ్ స్టార్స్ లో నటి ప్రియాంక చోప్రా జోనస్ జీడ ఒకరు. అయితే ఇపుడు ప్రియాంక చోప్రా మొదటి తెలుగు సినిమా ‘వారణాసి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళితో చేస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ని ఆమె గ్లోబల్ స్టేజిపై ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆమె వారణాసి ని ప్రమోట్ చేసింది.

అయితే ఈ స్టార్ తాలూకా పాపులర్ హిట్ ఓటిటి సిరీస్ ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్, అలాగే ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో అవెంజర్స్ దర్శకులు రసో బ్రదర్స్ నిర్మాతలుగా, ఒకరు దర్శకునిగా కూడా చేసిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ సిరీస్ సీజన్ 1 ప్రైమ్ వీడియోలో వచ్చి మంచి హిట్ అయ్యింది.

మరి దీనికి కొనసాగింపుగా వచ్చిన సీజన్ 2 ఇపుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సిరీస్ ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. సో సీజన్ 1 చూసినవారు ఇప్పుడు సీజన్ 2 ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు