అల్లు శిరీష్ సరసన ‘అందాల రాక్షసి’ హీరోయిన్!

అల్లు శిరీష్ సరసన ‘అందాల రాక్షసి’ హీరోయిన్!

Published on Jul 27, 2015 10:58 AM IST

Lavanya-Tripathi

‘గౌరవం’ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఆ తర్వాత ‘కొత్త జంట’ సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారాయన. ‘కొత్త జంట’ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శిరీష్, ఈమధ్యే ఓ కొత్త సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ‘యువత’, ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలతో మెప్పించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘సారొచ్చారు’ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ఇదే!

ఓ మంచి లవ్‌స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి ఎంపికైనట్లు తెలుస్తోంది. మొదట సూర్య vs సూర్య హీరోయిన్ త్రిదా చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వచ్చినా తాజాగా లావణ్య త్రిపాఠికే సినిమా యూనిట్ మొగ్గు చూపిందని సమాచారం. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు