హిందీలో వంద కోట్ల క్లబ్‌కు చేరువలో ‘బాహుబలి’!

హిందీలో వంద కోట్ల క్లబ్‌కు చేరువలో ‘బాహుబలి’!

Published on Jul 27, 2015 2:11 PM IST

baahubali11

దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమా విడుదలైన అన్నిచోట్లా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మూడో వారం కూడా అదే ఊపుతో దూసుకుపోతోంది. తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోయినా తమిళం, హిందీల్లో మాత్రం పలు పెద్ద సినిమాలు బాహుబలి ఊపును తగ్గిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమైనా, వాటన్నింటికీ భిన్నంగా సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది.

ఇక ప్రధానంగా బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాలకు అంతంతమాత్రమే ఆదరణ ఉన్న నేపథ్యంలోనే విడుదలై అక్కడా సంచలనాలు నమోదు చేయడం బాహుబలి సినిమాకే చెల్లింది. వేరే ఏ ఇతర సినిమాల ఊహకు కూడా అందనంతగా మూడో వారాంతం ముగిసేసరికి బాహుబలి దాదాపుగా 85 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి సంచలన రికార్డు నెలకొల్పింది. ఇక గత వారం విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా ‘భజరంగీ భైజాన్’ ఓ పక్క కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా, ‘బాహుబలి’ స్ట్రాంగ్‌గా నిలబడడం విశేషంగా కనిపిస్తోంది. ఇదే జోరుతో బాహుబలి కొనసాగితే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోవడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల టాక్!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు