పులి ఆడియోకి ముఖ్య అతిధిగా అతిలోక సుందరి

పులి ఆడియోకి ముఖ్య అతిధిగా అతిలోక సుందరి

Published on Jul 27, 2015 11:00 PM IST

sridevi (1)
తమిళ నటుడు విజయ్ నటించిన పులి సినిమా సెప్టెంబర్ 17న మనముందుకు రానుంది. ఈ సినిమా పోస్టర్, టీజర్ లు ప్రేక్షకుడికి ఒక కొత్త సినిమా చూడనున్నామన్న భావన కలిగించింది. చింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి ఒక ముఖ్య పాత్ర పోషించింది.

తమిళ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకకు శ్రీదేవి ముఖ్య అతిధిగా హాజరుకానుంది. తమిళనాడు మహాబలిపురం లో ఆగష్టు 2న ఈ వేడుక ఘనంగా జరగనుంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శృతిహాసన్, హన్సిక హీరోయిన్స్. సుదీప్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు