
మాస్ మహారాజ రవితేజ ఇన్ని రోజులు హీరోగానే బిజీగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఆయన కూడా పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఇటీవలే ఆయన లూనార్ చెప్పల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. తాజాగా మరో ఫేమస్ లిక్కర్ బ్రాండ్ అయిన ‘లార్డ్ అండ్ మాస్టర్’ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు. అంతే కాకుండా దాని కోసం ఆయన చేసిన ఫస్ట్ కమర్షియల్ యాడ్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ఈ కమర్షియల్ యాడ్ లో రవితేజ పోలీస్ గా రెండు పుంచ్ డైలాగ్స్ కూడా చెప్పి ఆకట్టుకున్నాడు.
డైరెక్ట్ గా లిక్కర్ బ్రాండ్ ని ప్రమోట్ చెయ్యకూడదు కాబట్టి ‘లార్డ్ అండ్ మాస్టర్’ మ్యూజిక్ సిడిస్ పేరుతో ఈ యాడ్ ని చేసారు. మొదట ఈ స్టిల్స్ రవితేజ చేస్తున్న బెంగాల్ టైగర్ సినిమాలోనివి అనుకున్నారు, కానీ అందులోవి కాదని ఆ యాడ్ ని రిలీజ్ చేసాక తెలిసింది. ప్రస్తుతం రవితేజ చివరి దశలో ఉన్న బెంగాల్ టైగర్ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా రవితేజ నటించిన సూపర్ హిట్ సీక్వెల్ కిక్ 2 సినిమా ఆగష్టు 21న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.
లార్డ్ అండ్ మాస్టర్ కమర్షియల్ యాడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

