శ్రీమంతుడు ఆడియోకి పెరుగుతున్న క్రేజ్

శ్రీమంతుడు ఆడియోకి పెరుగుతున్న క్రేజ్

Published on Jul 28, 2015 6:36 PM IST

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు బాక్స్ ఆఫీసు కూడా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ కాపీని జూలై 30 కల్లా పూర్తి రెడీ చేసి జూలై 31న సెన్సార్ కి పంపనున్నారు. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. రిలీజ్ రోజు నుంచే ఈ సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

రోజుల గడుస్తున్న కొద్దీ ఈ శ్రీమంతుడు ఆల్బమ్ కి క్రేజ్ మరింత పెరుగుతోంది. ఇందులో అన్ని ఫాస్ట్ బీట్ సాంగ్, మెలోడీ, మాస్ ఇలా రకాల పాటలు ఉండడం వలన ఒక్కొక్కరికీ ఒక్కో పాట నచ్చుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలోని మూడు సాంగ్స్ టాప్ సాంగ్స్ చార్ట్ లో ప్లేస్ దక్కించుకున్నాయి. పాటలలో విజువల్స్ కూడా సూపర్బ్ గా ఉండడంతో ఈ పాటలకి ఇంకా బాగా కనెక్ట్ అవుతున్నారు. పాటల్లానే దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని సమాచారం. మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో ఆగష్టు 7న రిలీజ్ కానుంది. శృతి హాసన్ మహేష్ కి జోడీగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు