బిజీ బిజీ – త్రిష కిట్టీలో 6 సినిమాలు

బిజీ బిజీ – త్రిష కిట్టీలో 6 సినిమాలు

Published on Jul 28, 2015 6:55 PM IST

trisha
సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా వెలుగొందిన అందాల భామ త్రిష. ఈ మధ్య కాలంలో త్రిష చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా చేసిన సినిమాలు అన్నీ స్టార్ హీరోస్ తో చేస్తూ వరుసగా విజయాలను అందుకుంటోంది. ఈ ఏడాది తమిళంలో ఎన్నై అరింధాల్ సినిమాతో హిట్ అందుకుంటే తెలుగులో లయన్ సినిమాతో మెప్పించింది. ఇది పక్కన పెడితే త్రిష పెళ్లి చేసుకోవాలనుకోని వరుణ్ తో నిశ్చితార్ధం కూడా చేసుకుంది, కానీ చివరి నిమిషంలో పెళ్లి కాన్సల్ అయ్యింది. దాంతో సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిషకి సినిమాల ఆఫర్స్ తగ్గుతాయని అనుకున్నారు.

కానీ త్రిష అందరినీ షాక్ చేసేలా తమిళంలో వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం త్రిష చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నాయి. ఈ విషయం తనకి చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఇదే విషయాన్నీ మీడియాకి చెబుతూ నాకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే ప్రస్తుతాన్ తన దృష్టంతా కెరీర్ పైనే అని తెలిపింది. త్రిష జయం రవి సరసన నటించిన సకల కళా వల్లభన్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు