అందరి దృష్టీ కొరటాల శివ పైనే.!

అందరి దృష్టీ కొరటాల శివ పైనే.!

Published on Jul 29, 2015 6:33 PM IST

koratala-shiva
రైటర్ గా ఎన్నో సక్సెస్ లు అందుకున్న కొరటాల శివ డైరెక్టర్ గా మారి చేసిన మొదటి సినిమా ‘మిర్చి’. ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఫ్యాక్షన్ మరియు యాక్షన్ అంశాలను కలబోసి తీసిన మిర్చి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. ఆగష్టు 7న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి, అలాగే రోజూ విడుదలవుతున్న ప్రచార చిత్రాలు, వీడియోస్ ద్వారా ఈ సినిమాఆపి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

దాంతో అందరి చూపు డైరెక్టర్ కొరటాల శివపైకి షిఫ్ట్ అయ్యింది. మహేష్ బాబుని సరికొత్తగా చూపడంలో కొరటాల శివ ఇప్పటికే సక్సెస్ అయ్యాడు, సినిమా పరంగా కూడా ఇదే రేంజ్ లో సక్సెస్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు కొరటాల శివకి ఇది రెండవ సినిమా కావడంతో ద్వితీయ విగ్నం అనే కాన్సెప్ట్ ని బ్రేక్ చేసి హిట్ కొడతాడా లేదా అని కూడా పలువురు అంటున్నారు. మరోవైపు మహేష్ బాబు తో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ హిట్ ని ఇస్తాడా లేదా అనే ప్రెజర్ కూడా కొరటాల శివపై ఉంది. దీంతో అందరి చూపు కొరటాల శివపైనే ఉంది.

కానీ మహేష్ బాబు, కొరటాల శివలు ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చి పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుంది అనేది తెలియాలంటే ఆగష్టు 7 వరకూ ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు