చిరు 150వ సినిమాపై పెరుగుతున్న సస్పెన్స్

చిరు 150వ సినిమాపై పెరుగుతున్న సస్పెన్స్

Published on Jul 29, 2015 7:22 PM IST

chiranjeevi
మెగా అభిమానులు ఈ ఏడాది ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం..మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ..చిరంజీవి నటించనున్న 150వ సినిమా ఈ ఏడాది మొదలు కానుందని తెలియగానే వారు సంతోషించారు. అంతే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు 150వ సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయనున్నాడని తెలియడంతో ఈ సినిమా వార్తల్లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనౌన్స్ చేసిన కొద్ది రోజుల పాటు మీడియాలో హాట్ టాపిక్ గా హల్ చల్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత సైలంట్ అయిపోయింది. అంతే కాకుండా పూరి కాకుండా వినాయక్ చిరు 150వ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడని వచ్చిన వార్తలు అభిమానుల్లో సందేహాన్ని కలిగించాయి.

పూరి జగన్నాధ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పానని అది చిరుకి చాలా బాగా నచ్చిందని, త్వరలోనే సెకండాఫ్ చెప్తానని కొద్ది రోజుల క్రితం తెలిపాడు. కానీ ఆ తర్వాత వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. అలాగే చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న 150వ సినిమాని లాంచ్ చేయాలి అనుకున్నారు. కానీ లాంచ్ టైం దగ్గర పడుతున్నా అటు పూరి, ఇటు చరణ్ సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో మెగా అభిమానుల్లో సస్పెన్స్ పెరిగిపోతోంది. పూరినే డైరెక్ట్ చేస్తాడా.? లేక ఇంకెవరన్నా డైరెక్ట్ చేస్తారా.? అనుకున్న టైంకి సినిమాని లాంచ్ చేస్తున్నారా.? లేదా.? అనే ప్రశ్నలు అభిమానుల్లో సస్పెన్స్ ని పెంచేస్తున్నాయి. మరి త్వరలోనే అభిమానులకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని మెగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు