ఫ్రెండ్షిప్ డే రోజున ‘గుంటూర్ టాకీస్’ గ్యాంగ్ ఇంట్రడక్షన్

ఫ్రెండ్షిప్ డే రోజున ‘గుంటూర్ టాకీస్’ గ్యాంగ్ ఇంట్రడక్షన్

Published on Jul 29, 2015 7:00 PM IST

firstlook-gunturtalkies
‘చందమామ కథలు’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన తదుపరి సినిమా ‘గుంటూర్ టాకీస్’. సిద్దు, శ్రద్ధ దాస్, రశ్మి గౌతమ్, సీనియర్ నరేష్, మహేష్ మంజ్రేకర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలోని అందరి పాత్రలను పరిచయం చేస్తూ కొన్ని పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్స్ తోనే కాకుండా ఓ పబ్లిక్ ఈవెంట్ లో ఈ చిత్ర టీంని మొత్తాన్ని వారి పాత్రల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నారు.

దానికోసమే ‘ఇంట్రడ్యూసింగ్ ది గ్యాంగ్స్ అఫ్ గుంటూరు టాకీస్’ అనే పేరుతో గ్రాండ్ గా ఓ ఈవెంట్ ని ఫ్రెండ్షిప్ డే రోజున అనగా ఆగష్టు 2న చేయనున్నారు. ఈ వేడుక కోసం విజయవాడ – గుంటూరు మధ్యలోని హాయ్ ల్యాండ్ వేదిక కానుంది. సాయంతం 5 గంటలకి ప్రారంభం కానున్న ఈ వేడుకకి అందరూ ఆహ్వానితులే.. ఈ వేదికపై ప్రవీణ్ సత్తారు పాత్రలని పరిచయం చేయడమే కాకుండా అభిమానులకు నటీనటులతో సేల్ఫీలు దిగేలా ఏర్పాటు చేసారు. ఈ వేడుకని ఓ ప్రముఖ చానల్ లో లైవ్ కూడా ఇవ్వనున్నారు. ఈ సేల్ఫీలలో బెస్ట్ తీసినవారికి రిలీజ్ రోజు 10 టికెట్స్ ని కూడా బహుకరించనున్నారు. ఆగష్టులో సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు