సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా త్వరలో విడుదలకానున్న నేపధ్యంలో విరివిగా మన హీరో ప్రచారాలలో పాల్గుంటున్నాడు. దీనిలో భాగంగా ఈరోజు సాయింత్రం 6 గంటలకు ట్విట్టర్ లో చాట్ సెషన్ పెట్టాడు.
అభిమానుల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తున్న మహేష్ టైం లైన్ లో ఒక ప్రశ్నకు అధిక ప్రాముఖ్యత లభించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో మల్టీ స్టారర్ కి మీరు సిద్ధమేనా అన్న ప్రశ్నకు “ఎందుకు కాదు” అన్న చిన్న సమాధానం అందరినీ అలరించింది.
అసలు సిసలైన డైరెక్టర్, ఉత్తేజ పరిచే కధ వుంటే ఈ కాంబినేషన్ తనకు ఇష్టమే అని చిన్న పాజిటీవ్ హింట్ ఇచ్చాడు మన మహేష్. ప్రస్తుతం ఈయన నటించిన శ్రీమంతుడు ఆగష్టు 7న విడుదలకానుంది.