షార్ట్ గాప్ తర్వాత షూట్ మొదలెట్టనున్న నాగ చైతన్య

షార్ట్ గాప్ తర్వాత షూట్ మొదలెట్టనున్న నాగ చైతన్య

Published on Aug 2, 2015 7:11 PM IST

Naga-Chaitanyas-first-look
అక్కినేని నాగ చైతన్య తన కెరీర్లో తొలి బిగ్ హిట్ అయిన ‘ఏం మాయ చేసావే’ సినిమా తీసిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 10 రోజుల క్రితమే గౌతమ్ మీనన్ నాగ చైతన్య పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేసారు.ఈ షెడ్యూల్ పూర్తి కాగానే నాగ చైతన్య సినిమా షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చాడు. రెండు రోజులు గ్యాప్ తీసుకున్న నాగ చైతన్య రేపటి నుంచి మళ్ళీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఎక్కువ లాంగ్ గ్యాప్స్ ఇవ్వకుండా ఈ సినిమాని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు.

మొదటి షెడ్యూల్ లోనే ఈ సినిమా 50% షూటింగ్ ఫినిష్ చేసారు. టాలీవుడ్ ఫేమస్ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాని తెలుగులో నిర్మిస్తున్నాడు. కోన వెంకట్ ఇప్పటి వరకూ ఈ సినిమా తెరకెక్కిన షూటింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మలయాళ భామ మంజిమ మోహన్ ఈ సినిమాలో నాగ చైతన్య సరసన జోడీగా కనిపించనుంది. తమిళ్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద’ అనే టైటిల్ ని పెట్టిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు