
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ హీరోను ‘శ్రీమంతుడు’గా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే సస్పెన్స్ కి మరో 5 రోజుల్లో పుల్ స్టాప్ పడనుంది. మహేష్ బాబు మిర్చి ఫేం కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ భారీ అంచనాల మధ్య ఆగష్టు 7న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఒకేసారి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి ‘సెల్వందన్’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు. ముందుగా ఈ సినిమా ఆడియోని జూలై 31న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
తాజా సమాచారం ప్రకారం సెల్వందన్ ఆడియోని ఆగష్టు 4న చెన్నైలో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబుతో పాటు మిగిలిన టీం మొత్తం ఈ ఆడియో వేడుకకి హాజరు కానున్నారని సమాచారం. గత వారం రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు రానున్న రెండు రోజులు తమిళ ప్రమోషన్స్ లో బిజీగా ఉండనున్నాడు. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని మహేష్ బాబు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

