మెగా హీరోస్ టైటిల్స్ పై తమన్ కామెంట్

మెగా హీరోస్ టైటిల్స్ పై తమన్ కామెంట్

Published on Aug 4, 2015 3:44 PM IST

s-s-Thaman
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు జెట్ స్పీడ్ గా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ప్రస్తుతం తమన్ కిట్టీలో 10కి పైగా సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాలు ఉన్నా ప్రతి సినిమాకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తూ అందరి దర్శకులకు నచ్చే మ్యూజిక్ ని అందిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు తమన్. ఇంత బిజీలో కూడా తన సినిమాలకు సంబందించిన న్యూస్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అలా తాజాగా తమన్ చేసిన ట్వీట్స్ మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాయి.

తమన్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శ్రీను వైట్ల, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా తమన్ ‘ప్రస్తుతం బోయపాటి శ్రీను గారితో మ్యూజిక్ సిట్టింగ్స్. సినిమాకి అదిరిపోయే ఓ టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. ఈ టైటిల్ ఎప్పుడెప్పుడు మీకు చెప్పలా అని ఎదురు చూస్తున్నాను. అలాగే రంక్ హరన్ సినిమాకి కూడా సూపర్ ఎనర్జిటిక్ టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ టైటిల్స్ ని కూడా అనౌన్స్ చేస్తానని’ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్స్ మెగా అభిమానుల్లో మరింత ఉత్కంఠని పెంచేశాయి. ఈ సినిమా టైటిల్స్ కోసం మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు