లారెన్స్‌ సరసన హీరోయిన్‌గా కాజల్!

లారెన్స్‌ సరసన హీరోయిన్‌గా కాజల్!

Published on Aug 4, 2015 7:54 PM IST

Kajal-ragava-lawanrce
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి దర్శకులుగా మారిన వారిలో లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫ్హర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగానూ పలు ఘన విజయాలను నమోదు చేశారు. ముఖ్యంగా హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘ముని’ సిరీస్‌లోని మూడు సినిమాలూ ఘన విజయం సాధించి దర్శకుడిగా లారెన్స్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ సిరీస్‌లో వేసవి కానుకగా వచ్చిన ‘కాంచన 2’ తమిళనాట ప్రభంజనమే సృష్టించింది. ఇక ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాఘవ లారెన్స్ రెండు వరుస సినిమాలకు కమిటయ్యారు.

వెందార్ మూవీస్ సంస్థతో కలిసి రాఘవ లారెన్స్ రెండు సినిమాలకు సైన్ చేశారు. ‘మొట్టశివ కెట్ట శివ’ పేరుతో తెరకెక్కనున్న ఓ సినిమాను నిన్ననే లాంచ్ చేశారు. రాఘవ లారెన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటిస్తున్నారు. ‘కాంచన 2’లో పాపులర్ అయిన ‘మొండి శివ గుండు శివ’ (తమిళంలో మొట్టశివ కెట్ట శివ) అన్న డైలాగ్‌నే లారెన్స్ తన కొత్త సినిమాకు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల నటించనుండడం. తమిళ, తెలుగు, హిందీ సినిమాలతో స్టా హీరోయిన్‌గా పేరు సంపాదించిన కాజల్, లారెన్స్‌ సినిమాకు ఓకే చేసేశారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు