రామ్ కోసం పోలీస్ గా మారిన రాశి ఖన్నా

రామ్ కోసం పోలీస్ గా మారిన రాశి ఖన్నా

Published on Aug 4, 2015 8:19 PM IST

Rasi-kanna
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కి ఎక్కువ గ్లామర్ పాత్రలే దొరుకుతున్నాయి.. చాలా తక్కువగా నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు దొరుకుతుంటాయి. కానీ అందాల భామ రాశి ఖన్నాకి మాత్రం కెరీర్ ప్రారంభంలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు తన కిట్టీలో వేసుకుంటోంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జిల్’ సినిమాలలో తన పెర్ఫార్మన్స్ తో యువతను ఆకర్షించింది. ప్రస్తుతం రామ్ సరసన ‘శివం’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కూడా రాశి ఖన్నా పాత్ర కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం కాకుండా నటనకి కూడా ప్రాధాన్యం ఉందని, అది కూడా రెగ్యులర్ కి భిన్నమైన ఓ పాత్రలో కనిపించనుందని సమాచారం.

అదేమిటని తెసుకుంటే.. మాకు అందిన సమాచారం ప్రకారం రాశి ఖన్నా ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. రాశి ఖన్నా అటు పాటల్లో, లవ్ సీన్స్ లో గ్లామర్ తో ఆకట్టుకుంటూనే, పోలీస్ ఆఫీసర్ గా కూడా మంచి నటనని కనబరిచిందని ఈ చిత్ర టీం అంటున్నారు. నేటితో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఒక చిన్న గ్యాప్ తర్వాత ఈ చిత్ర టీం ఈ సినిమాలో మిగిలి ఉన్న రెండు పాటలని షూట్ చేయడం కోసం నార్వే, స్వీడన్ వెళ్లనున్నారు. ఈ అవుట్ డోర్ షెడ్యూల్ ఆగష్టు 18 నుంచి మొదలు కానుంది. శ్రీనివాస్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. స్రవింతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు