మణిరత్నం సినిమాటోగ్రాఫర్‌తో త్రివిక్రమ్

మణిరత్నం సినిమాటోగ్రాఫర్‌తో త్రివిక్రమ్

Published on Aug 5, 2015 11:50 AM IST

mani-rathnam-and-trivikram
మణిరత్నం సినిమాల్లో బలమైన భావోద్వేగం ఒకటి ఉంటుంది. ఆ బలమైన భావోద్వేగాన్ని అందంగా, హత్తుకునేలా చెప్పడంలో మణిరత్నం కృషి ఎంతటిదో, ఆ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన వారిదీ అంతే ఉంటుంది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ తాను చెప్పాలనుకున్న భావోద్వేగాన్ని తనదైన పంథాలో, సున్నితమైన సంభాషణలతో చెబుతుంటారు. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు అందాన్ని తెచ్చిపెట్టిన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్, త్రివిక్రమ్ కలిసి ఒక సినిమాకు పనిచేయనున్నారు. త్రివిక్రమ్-నితిన్‌తో చేయనున్న సినిమాకు రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్, హీరో నితిన్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. సమంత హీరోయిన్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను హారికా అన్డ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది. ఇక త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్ వార్తల్లోకి వచ్చిన రోజు నుంచే ఈ సినిమా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు పనిచేయనున్నారనే వార్త దగ్గర్నుంచీ ఇప్పుడు రాజీవ్ మీనన్ ఈ సినిమాకు పనిచేయడం వరకూ ప్రతిదీ వార్తే అయింది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘బొంబాయ్’, ‘గురు’, ‘కడలి’ సినిమాలకు రాజీవ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దర్శకుడిగానూ తనదైన మార్క్ చూపెట్టిన రాజీవ్, త్రివిక్రమ్ సినిమాకు ఓ సరికొత్త ఫీల్‌ను తీసుకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెల్లోనే ఈ సినిమా అఫీషియల్‌గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు