
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్. సీనియర్ రైటర్ అయిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కథని అందించడమే కాకుండా, ఎస్ఎస్ రాజమౌళి తీసిన దాదాపు అన్ని సినిమాలకు ఆయన కథలని అందించాడు. ఆయన కలం నుంచి జాలువారిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలే ‘బాహుబలి’ మరియు ‘బజ్రంగి భాయ్ జాన్’. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన పలు కథలను తయారు చేసే పనిలో ఉండడమే కాకుండా తన డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. తాజాగా ఆయన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే జరిగిన ఓ పబ్లిక్ ఫంక్షన్ లో కలుసుకున్న రజినీకాంత్ – విజయేంద్ర ప్రసాద్ లు తమ కాంబినేషన్ లో ఓ సినిమాని అనుకున్నారు. ఈ విషయం గురించి అందిన రిపోర్ట్స్ ప్రకారం.. విజయేంద్ర ప్రసాద్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్టొరీ లోనే ని నేరేట్ చేయగా, దానికి రజినీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ రజింత్ తో ఓ సినిమా అలాగే రోబో 2 కి గ్రీన్ సిగంల్ ఇచ్చాడు. రోబో 2 అయిపోయాక 2016లో ఈ సినిమా ఉండచ్చని సమాచారం. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే విజయేంద్ర ప్రసాద్ మొదటగా ‘బజ్రంగి భాయ్ జాన్’ కథ చెప్పింది రజినీకాంత్ కె కావడం విశేషం.

