
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమాకి యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్స్ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్ ల్యాండ్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ని ఓ స్టంట్ మాస్టర్ గా చూపనున్నాడు శ్రీను వైట్ల. పాత్రని చాలా రఫ్ అండ్ టఫ్ గా డిజైన్ చేసిన శ్రీను వైట్ల ఆ పాత్రకి పేరు మాత్రం ఓ ఫేమస్ లవర్ బాయ్ పేరు పెట్టారు. తెలుగు, తమిళ చిత్ర సీమలో లవ్ స్టోరీస్ సినిమాలో హీరోలందరికీ పెట్టే ఎక్కువ పేరు కార్తీక్. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు 1980ల నుంచి వస్తోంది. కేవలం లవ్ స్టోరీస్ లోనే కాదు కార్తీక్ అంటే అదొక హీరోకి పెట్టె పేరు అని కూడా బాగా ఫేమస్ అయిన పేరిది.
అలాంటి పేరుని శ్రీను వైట్ల తన సినిమాలో రామ్ చరణ్ కి పెట్టారు. పాత్రని అంత మాస్ గా డిజైన్ చేసిన శ్రీను వైట్ల చరణ్ పేరు మాత్రం కార్తీక్ అని పేరు పెట్టడంలో అంతరార్ధం ఏంటనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.. నిన్నటి వరకూ రామ్ చరణ్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం రావు రమేష్ – సాయాజీ షిండేలపై కొన్ని కీలక సన్నివేశాలను చూట్ చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత. ప్రస్తుతం టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం బ్రూస్ లీ, ఫైటర్ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.

