ఈ రోజు రాత్రి యుఎస్ వెళ్లనున్న ‘శ్రీమంతుడు’ ప్రింట్స్

ఈ రోజు రాత్రి యుఎస్ వెళ్లనున్న ‘శ్రీమంతుడు’ ప్రింట్స్

Published on Aug 5, 2015 11:36 PM IST

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ నిన్ననే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకుంది. ఆగష్టు 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. సెన్సార్ పూర్తైన తర్వాత ఈ చిత్ర టీం ఫైనల్ గా మరోసారి సినిమా చూసుకొని కాస్త లాగ్ అనిపించగా ఒక 10నిముషాలు ట్రిమ్ చేసి ఫైనల్ వెర్షన్ ని అన్ని ఎరియలకి పంపుతున్నారు. అలాగే క్యూబ్, యుఎఫ్ఓ, స్కాబుల్ లాంటి శాటిలైట్ సంస్థలకి ప్రింట్స్ ని పంపారు.

అలాగే వీటితో పాటు ఓవర్సీస్ కి వెళ్ళాల్సిన అన్ని హార్డ్ డిస్క్స్ ఈ రోజు రాత్రి వెళ్లనున్న స్పెషల్ ఫ్లైట్ లో యుఎస్ వెళ్లనున్నాయి. రేపటి ఉదయం కల్లా యుఎస్ లోని అన్ని ప్రాంతాలకు ప్రింట్స్ అందేలా ఈ చిత్ర మేకర్స్ ప్లాన్ చేసారు. సుమారు 160 లొకేషన్స్ లో శ్రీమంతుడు ప్రీమియర్స్ ప్లాన్ చేసారు. ఇప్పటికే ఈ ప్రీమియర్స్ కి సంబందించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతటా ప్రీమియర్ షోస్ టికెట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్, సనమ్ శెట్టి, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు