‘సెల్వందన్’ రిలీజ్ గర్వంగా ఉందన్న మహేష్!

‘సెల్వందన్’ రిలీజ్ గర్వంగా ఉందన్న మహేష్!

Published on Aug 6, 2015 9:29 PM IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’గా మరికొద్ది గంటల్లోనే కనువిందు చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు అంతటా తమ హీరో సినిమా సందడి మొదలుపెట్టేశారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి పెద్ద ఎత్తున విడుదల కానుంది. మహేష్ కెరీర్లో మొదటిసారి ఒక సినిమా తెలుగుతో పాటే సమాంతరంగా తమిళంలోనూ సెల్వందన్ పేరుతో విడుదల కానుండడం విశేషం.

ఇక చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ఇతర ప్రాంతాల్లోనూ మార్కెట్ ఉన్న మహేష్, మొదటిసారి తన సినిమా తెలుగుతో పాటే తమిళంలోనూ విడుదల కానుండడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు. చెన్నైలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ మాట్లాడుతూ “నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో, ఇక్కడి నేటివ్ భాషలో నా సినిమా ఒకటి విడుదల కానుండడం చాలా గర్వంగా ఉంది. చెన్నైలో నా తెలుగు సినిమాలను మొదట్నుంచీ ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సెల్వందన్‌ను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నా” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు