
సూపర్ స్టార్ మహేష్ బాబు జూలై 18న జరిగిన శ్రీమంతుడు సినిమా ఆడియో వేడుకలో గత సినిమాలు అభిమానుల్ని నిరుత్సాహపరిచాయి. కానీ నా బర్త్ డే కానుకగా నేను ఇవ్వనున్న శ్రీమంతుడు అనే గిఫ్ట్ మాత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని తెలిపాడు. ఈ రోజు రిలీజ్ అయిన శ్రీమంతుడు సినిమాకి వస్తున్నా సూపర్బ్ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే మహేష్ బాబు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం జరిగిన బెనిఫిట్ షోస్ నుంచి ‘శ్రీమంతుడు’ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే పెర్ఫార్మన్స్ మరియు కొరటాల శివ స్టైలిష్ టేకింగ్ పై అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి మహేష్ బాబే థ్రిల్ అయ్యాడు. ‘నా లైఫ్ లో ఈ రోజు చాలా ఆనందమయమయిన రోజు.. శ్రీమంతుడికి మీ అందరి నుంచి వస్తున్న రెస్పాన్స్ నన్ను మరింత హ్యాపీగా చేస్తోంది. అందరికీ నా మనస్పూర్తి ధన్యవాదాలు.. లవ్ యు ఆల్’ అని మహేష్ బాబు ట్వీట్ చేసాడు. సోషల్ మీడియాలో అయితే మహేష్, కొరటాల శివ, శృతి హాసన్, జగపతి బాబుల పెర్ఫార్మన్స్ లకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీమంతుడికి వస్తున్న పాజిటివ్ రిపోర్ట్ చూసి మొదటి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

