
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలైంది. ఊరిని దత్తత తీసుకోవడమనే అంశాన్ని సున్నితమైన ఫ్యామిలీ సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తీసిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటిరోజు ఈ సినిమా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డ్‌లతో కనిపించి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి.
ఇదిలా ఉంటే.. శ్రీమంతుడు సినిమాకు అభిమానులు, ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి సైతం శ్రీమంతుడు సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు. నిన్న ఉదయం శ్రీమంతుడు సినిమా చూసిన ఆయన, ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్‌ను ఇంత కమర్షియల్‌గా చెప్పడాన్ని ప్రశంసించారు. ఇక ఇదే విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. “ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్‌కు ఫ్యామిలీ సెంటిమెంట్‌ను జత చేయడమనేదే ఈ సినిమా విజయ సూత్రం. శివగారు అందులో సరైన నైపుణ్యం చూపించారు. మహేష్ సబ్ట్ల్ యాక్టింగ్, డైలాగులతో సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టారు. బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న టీమ్‌కు అభినందనలు అని తెలిపారు.
మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు.

