సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆయన బర్త్ డే కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. గత మూడు రోజులుగా ఈ సినిమా బాక్స్ ఆఫీసు కాసుల వర్షం కురిపిస్తోంది. మహేష్ కెరీర్లో కలెక్షన్స్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ గా నిలవనున్న ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించనున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని ప్రారంభించినప్పుడే ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని తెలిపారు.
అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచే మొదలు కావాలి, అలాగే మహేష్ బాబు కూడా షూట్ లో జాయిన్ అవ్వాలి. కానీ ఇంకా మొదలు కాలేదు. అదీ కాక శ్రీమంతుడు ప్రమోషన్స్ లో మహేష్ బాబు బిజీకావడం వలన తను కూడా షూట్ లో జాయిన్ అవ్వలేదు. దీంతో పలువురు ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందేమో అని అంటున్నారు. కానీ మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాని ఆన్ టైం ఫినిష్ చేసి అనుకున్న టైంకె రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఈ చిత్ర టీంకి షూటింగ్ ఆన్ టైం ఫినిష్ చెయ్యాలని ఈ చిత్ర టీంకి కూడా చెప్పినట్లు సమాచారం. శ్రీమంతుడు ఇచ్చిన సక్సెస్ తో మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ ని శరవేగంగా ఫినిష్ చేయనున్నాడు.
పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.


